W.G: ఆకివీడు నగర పరిధిలోని శాంతినగర్‌లో నివాస ప్రాంతాల మధ్య సెల్ టవర్ నిర్మాణానికి అనుమతి ఇవ్వద్దని కాలనీవాసులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సోమవారం టవర్ నిర్మాణం చేయొద్దని, సెల్ టవర్ నిర్మాణానికి వ్యతిరేకంగా మున్సిపల్ కమిషనర్ కృష్ణమోహన్‌కు కాలనీలో నివసించే ప్రజల సంతకాలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. దీనిపై తక్షణమే చర్యలు తీసుకోవాలన్నారు.