VZM: రామభద్రపురం స్థానిక ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం (PACS) మహా జన సభను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశంలో సంఘం ఛైర్మన్ చొక్కాపు రామారావు మాట్లాడుతూ.. సొసైటీ ప్రగతి, రైతుల అభివృద్ధి, వ్యవసాయ రుణాలు, ఎరువుల అందించాలనే కీలక అంశాలపై పాలకవర్గ సభ్యులు, రైతులతో కలిసి చర్చించామన్నారు. ఈ కార్యక్రమంలొ CEO వాసు, MPTCలు, రైతులు, సొసైటీ సిబ్బంది పాల్గొన్నారు.