JN: జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో ఈరోజు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వివిధ సమస్యలపై 232 దరఖాస్తులు రాగా వాటిని కలెక్టర్ స్వయంగా స్వీకరించారు. ప్రజావాణి దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.