సత్యసాయి: పుట్టపర్తి కలెక్టరేట్లో ఇవాళ నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పాల్గొన్నారు. ప్రజల నుంచి వచ్చిన అర్జీలను క్షేత్రస్థాయిలో పరిశీలించి నిర్ణీత గడువులోపు నాణ్యతగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మొత్తం 247 అర్జీలు స్వీకరించి సంబంధిత శాఖల అధికారులకు పంపించారు.