NGKL: జిల్లాలో కొత్తగా అర్హత పొందిన 161 మంది లైసెన్స్ సర్వేయర్లకు అదనపు కలెక్టర్ అమరేందర్ సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. భూమి సర్వే పనులు ప్రజలకు అత్యంత కీలకమని, పారదర్శకంగా సేవలు అందించాలని ఆయన సూచించారు. కలెక్టరేట్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లా సర్వే విభాగం అధికారులు, సర్వేయర్లు పాల్గొన్నారు.