MHBD: నెల్లికుదురు మండలం రామన్నగూడెం, కాచికల్ గ్రామాల్లోని ద్విచక్ర వాహనదారులు ఏప్రిల్ 02 నుంచి హెల్మెట్లు ధరించాలని ఎస్సై చిర్ర రమేష్ బాబు గ్రామస్తులకు సూచించారు. రెండు గ్రామాల్లోని ద్విచక్ర వాహనదారుల ఇళ్లకు ఎస్సై తన సిబ్బందితో కలిసి వెళ్లి హెల్మెట్లు పెట్టుకోని వాహనాలు నడపాలని, హెల్మెట్లు ధరించని వారికి గ్రామాల్లోకి ప్రవేశం లేదన్నారు.