గోధుమ గింజలోని పీచు, పోషకాలను తొలగించి కేవలం పిండి పదార్థంతో మైదాను తయారు చేస్తారు. ఇందులో ఎటువంటి పోషకాలు ఉండవు. దీనితో చేసిన జంక్ ఫుడ్, స్వీట్లు తినడం వల్ల డయాబెటిస్, గుండె జబ్బులు, జీర్ణ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. అందుకే మైదా వస్తువులకు దూరంగా ఉండటం ఆరోగ్యానికి ఎంతో మంచిదని నిపుణులు చెబుతున్నారు.