MNCL: చెన్నూర్ను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని BJP జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర గౌడ్ అన్నారు. సోమవారం పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. రానున్న గోదావరి పుష్కరాలను దృష్టిలో పెట్టుకుని పంచక్రోష గోదావరి ఉత్తర వాహిని తీర ప్రాంతమైన చెన్నూర్ను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. మంత్రి వివేక్ పట్టణ అభివృద్ధి కోసం పాటుపడాలన్నారు.