WGL: ప్రజావాణి కార్యక్రమంలో సమస్య పరిష్కారం కోసం జిల్లా కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్‌కు వచ్చిన ఓ వృద్ధురాలు క్యూలైన్లో నిలబడి ఇబ్బందిపడుతున్నది గమనించిన కానిస్టేబుల్ వెంటనే స్పందించాడు. ఆమెకు కూర్చోవడానికి కుర్చీ ఏర్పాటు చేసి సహాయం అందించాడు. ఈ చర్యతో అక్కడున్న వారంతా అతని మానవత్వాన్ని ప్రశంసిస్తూ కృతజ్ఞతలు తెలిపారు.