అన్నమయ్య: కోళ్లబైలు పంచాయతీలోని హౌసింగ్ లేఅవుట్లో గృహప్రవేశాల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ నిశాంత్, ఎమ్మెల్యే షాజహాన్ భాష లబ్ధిదారులకు ఇండ్లను అందజేశారు. రాష్ట్రవ్యాప్తంగా 2,50,893 ఇళ్ల గృహప్రవేశాలు నిర్వహించగా, పేదల సొంతింటి కల సాకారం కావడం ఆనందంగా ఉందని అధికారులు తెలిపారు. బీసీ, ఎస్సీలకు రూ.50వేలు, ఎస్టీలకు రూ.75వేలు అదనపు సహాయంతో ఇళ్లను పూర్తి చేశారు.