శ్రీకాకుళం పట్టణంలో ఉన్న అభ్యుదయ డిగ్రీ కళాశాలలో మంగళవారం మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఈ జాబ్ మేళాలో పలు కంపెనీలు పాల్గొని సుమారు 500లకి పైగా ఉద్యోగ అవకాశాలను కల్పించనున్నట్లు జిల్లా స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారి సాయికుమార్ తెలిపారు. పదో తరగతి నుంచి డిగ్రీ పూర్తి చేసిన వారు naipunyam.ap.gov.in వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకోవాలన్నారు.