VSP: జిల్లా కోర్టుకు బాంబ్ బాంబు బెదిరింపు మెయిల్ రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ బృందాలు కోర్టు ప్రాంగణాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయగా, అనుమానాస్పద వస్తువులు ఏమి లభించలేదు. ఈ మెయిల్ తమిళనాడు నుంచి వచ్చినట్లు గుర్తించిన సైబర్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇదే కోర్టుకి రెండోసారి బెదిరింపు రావడం గమనార్హం.