NGKL: పెద్దకొత్తపల్లి మండలంలోని తాళ్ల వెంకటస్వామి కోళ్ల ఫారంలో నాలుగు రోజుల్లో 4,500 కోళ్లు మృతి చెందాయి. దీంతో రైతుకు రూ.10.50 లక్షల భారీ నష్టం వాటిల్లింది. అధికారులు సరైన మార్గదర్శకాలు ఇవ్వడం లేదని, తక్షణమే ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. కోళ్లకు వచ్చే వ్యాధులపై అవగాహన సదస్సులు నిర్వహించాలని కోరుతున్నారు.