MBNR: నగరంలో ‘డ్రగ్స్ రహిత మహబూబ్ నగర్’ లక్ష్యంతో జిల్లా పోలీసులు నిర్వహించిన అవగాహన సదుస్సులో మేయర్ గుమ్మల మమత శ్రీనివాస్, డెప్యూటీ మేయర్ ఎం. సురేందర్ రెడ్డి పాల్గొన్నారు. మాదకద్రవ్యాల మహమ్మారి నుంచి యువతను, విద్యార్థులను రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని వారు పిలుపునిచ్చారు. సమాజాన్ని పట్టి పీడిస్తున్న ఈ వ్యసనానికి వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ పోరాడాలని కోరారు.