MDK: జిల్లా కలెక్టరేట్ ప్రధాన గేటు వద్ద బస్ షెల్టర్లు, తాగునీటి సౌకర్యం కల్పించాలని రామాయంపేట పట్టణానికి చెందిన ఫిర్యాదుదారుడు ‘చిన్న’ సోమవారం ప్రజావాణిలో విన్నవించారు. గత రెండేళ్లుగా ఈ సమస్యపై విన్నవిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని వాపోయాడు. షెల్టర్లు లేక దివ్యాంగులు, వృద్ధులు ఎండలో ఇబ్బందులు పడుతున్నారన్నారు. కలెక్టరేట్ స్పందించి చర్యలు తీసుకోవాలన్నారు.