లాకర్లలో ఏముంటుందో బ్యాంకులు చూడవని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలమ్మ తెలిపారు. కస్టమర్లు దాచుకునే విలువైన వస్తువులను చూడటం బ్యాంకింగ్ నిబంధనలకు విరుద్ధమని వెల్లడించారు. అందువల్ల అందులో ఉన్న వస్తువులను బట్టి బీమా కవరేజ్ ఇవ్వడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. ఏదైనా నష్టం జరిగిన సమయంలో లాకర్ వార్షిక అద్దెకు 100 రెట్ల వరకు బ్యాంకులు పరిహారం చెల్లిస్తామని తెలిపారు.