BPT: విద్యార్థుల సంక్షేమం విషయంలో రాజీ పడేది లేదని బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు స్పష్టం చేశారు. మండల పరిధిలోని వెదుళ్ళపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆయన ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. పాఠశాల పరిస్థితులను సమీక్షించారు. తనిఖీలో భాగంగా ఎమ్మెల్యే నేరుగా తరగతి గదులకు వెళ్లి విద్యార్థులతో మాట్లాడారు.