W.G: పేద ప్రజలకు సొంతింటి కల కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ అన్నారు. సోమవారం ప్రధానమంత్రి ఆవాస్ యోజన (అర్బన్) పథకంలో భాగంగా అర్హులైన లబ్దిదారులకు రాష్ట్ర వ్యాప్తంగా 2,50,893ల నూతన గృహాల నిర్మాణం పూర్తి కావడం ఎంతో హర్షణీయమన్నారు. దీనిలో భాగంగా తణుకులోని 15వ వార్డులో ఏర్పాటు చేసిన గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు.