కడప జిల్లాలోని రామేశ్వర క్షేత్రంలో శ్రీ రాజరాజేశ్వరి సమేత ముక్తి రామలింగేశ్వర స్వామి, శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి దేవి సమేత హనుమత్ లింగేశ్వర స్వామి దేవస్థానాలు బ్రహ్మోత్సవాలకు సిద్ధమయ్యాయి. ఈ మహాకార్యానికి భక్తులు భక్తిపారవశ్యంలో మునిగితేలేందుకు ఎదురుచూస్తున్నారు. ఈ ఉత్సవాలకు సర్వం సిద్ధం చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు.