TG: రాష్ట్రంలోని ప్రభుత్వ రంగ సంస్థల తీరుపై కాగ్ విస్తుపోయే నిజాలను బయటపెట్టింది. 2023 మార్చి వరకు ఉన్న గణాంకాలను విశ్లేషించిన కాగ్.. రాష్ట్రంలో మొత్తం 83 ప్రభుత్వ రంగ సంస్థలు ఉండగా.. వాటిలో 16 సంస్థలు ఇప్పటికే మూతపడ్డాయని పేర్కొంది. కేవలం 6 సంస్థలే లాభాల్లో ఉన్నాయని.. 11 సంస్థలైతే పూర్తిగా నష్టాల్లో కూరుకుపోయాయని చెప్పింది. సింగరేణిలో అవకతవకలు జరిగినట్లు గుర్తించింది.