TG: హైదరాబాద్ శివారులోని మోకిలా పరిధిలో భారీగా డ్రగ్స్ పట్టుబడటం కలకలం రేపింది. అత్యంత ఖరీదైన ‘కొకైన్’ విక్రయిస్తున్న ముఠాను మోకిలా పోలీసులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఈ ముఠాలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగితో పాటు ప్రముఖ టెక్ సంస్థ గూగుల్లో పనిచేసే సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఉండటం గమనార్హం. పక్కా సమాచారంతో పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.