శివాజీ, లయ, రోహన్ ప్రధాన పాత్రల్లో నటించిన వినోదాత్మక చిత్రం ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూస’. మార్చిలో థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించిన ఈ సినిమా, ఇప్పుడు OTTలో సందడి చేసేందుకు సిద్ధమైంది. ఏప్రిల్ 3 నుంచి ‘ఈటీవీ విన్’లో ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది. సుధీర్ శ్రీరామ్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీలో అలీ, ధనరాజ్, ఇమ్మాన్యుయేల్ తమ కామెడీతో అలరించారు.