TG: ఉభయసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. మండలి సమావేశాలు ప్రారంభంకాగానే బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు నిరసన స్టార్ట్ చేశారు. ఈ క్రమంలో శాసనమండలి వెల్ లోకి దూసుకొచ్చి బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ఆందోళన చేస్తున్నారు. రాఘవ సంస్థపై హౌస్ కమిటీ వేయాలని సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలుపుతున్నారు.