SDPT: శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో మొత్తం 11,193 కేసులను పరిష్కరించినట్లు సీపీ రష్మీ పెరుమాళ్ తెలిపారు. ఇందులో 733 ఐపీసీ, 7,995 డీడీ, 2,465 ఈ-పెట్టీ కేసులు ఉన్నాయన్నారు. కేసుల పరిష్కారంతో బాధితులకు తక్షణ న్యాయం చేకూరడంతో పాటు కోర్టులపై భారం తగ్గిందని పేర్కొన్నారు. న్యాయమూర్తులు, న్యాయవాదులు మరియు పోలీసు సిబ్బందిని ఆమె ఈ సందర్భంగా అభినందించారు.