AP: వెనుకబడిన వర్గాలను ఆర్థికంగా బలోపేతం చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సవిత తెలిపారు. ప్రకృతి వ్యవసాయంపై విజయవాడలో EWS సామాజిక వర్గీయులకు నిర్వహించిన వర్క్ షాప్లో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రకృతి వ్యవసాయం ఆవశ్యకత గురించి కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోందని పేర్కొన్నారు. సహజ వనరుల వినియోగంతో నేల సారం పెరుగుతుందని అన్నారు.