శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ అధ్యక్షతన ‘మన పల్లె – మన నీరు’ కార్యక్రమం అమలుపై శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని చెరువుల సామర్థ్యాన్ని పెంచి నీటి నిల్వలు మెరుగుపడేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. పనుల అమలులో అధికారులు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ సూచించారు.