ADB: మంచి కంటి చూపుతో ప్రమాదాల నివారణ సాధ్యమని SP అఖిల్ మహాజన్ తెలిపారు. సోమవారం బోథ్ మండల కేంద్రంలో జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో ఆటో, టాక్సీ, లారీ, కార్ డ్రైవర్లకు ఉచితంగా కంటి వైద్య పరీక్షలను నిర్వహించారు. డిఫెన్సివ్ డ్రైవింగ్తో రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చని, ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వాహన నియమ నిబంధనలు పాటించాలని SP సూచించారు.