WGL: వరంగల్ నగరంలోని ప్రాంతీయ నేత్ర వైద్య ఆస్పత్రిలో సోమవారం రాత్రి కొండచిలువ కలకలం రేపింది. ఆటోనగర్ వైపు నుంచి మెయిన్ గేట్ ద్వారా లోపలికి వచ్చిన సుమారు ఐదు అడుగుల కొండచిలువ కనిపించడంతో వైద్యులు, సిబ్బంది, రోగులు భయాందోళనకు గురయ్యారు. ఇటీవలే ఈ నెల 23న చిన్న పాము కనిపించిన ఘటనతో పాటు మళ్లీ ఇలాంటి సంఘటన చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది.