AP: నెల్లూరు జిల్లాలో ఓ గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. వెంకటాచలం-మనుబోలు మధ్య గూడ్స్‌లోని పాల ట్యాంకర్ బోల్తా పడింది. కొమ్మలపూడి జంక్షన్ వద్ద ట్రాక్‌పై ట్యాంకర్ అడ్డంగా పడింది. దీంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. గూడ్స్ రైలు విజయవాడ నుంచి తిరుపతి వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.