VZM: బొబ్బిలి మున్సిపాలిటీలోని పన్నులు వసూలు వేగవంతం చేశారు. పన్నులు వసూళ్లకు ఒక్కరోజు మాత్రమే సమయం ఉండడంతో కమిషనర్ ఎల్. రామలక్ష్మి, రెవిన్యూ, సచివాలయ ఉద్యోగులు ఇంటింటికి వెళ్లి ఆస్తి పన్ను, ఖాళీ స్థలాలు, కుళాయి పన్నులు వసూలు చేస్తున్నారు. రేపటిలోగా పన్నులు చెల్లిస్తే వడ్డీలో 50శాతం రాయితీ వస్తుందన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రజలను కోరారు.