SDPT: కోహెడలోని శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఐదు రోజుల ఉత్సవాలలో భాగంగా నాలుగవ రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. శ్రీ పరాభవ నామ సంవత్సరం చైత్ర శుద్ధ ద్వాదశి సోమవారం సాయంత్రం సదస్సు, జాతర ఉత్సవాలు, బైరి పూజ, బండ్ల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. హోమం నిర్వహించగా, భజన మండలి భక్తులు భక్తి గీతాలతో అలరించారు. దేవాలయం నుంచి హైస్కూల్ వరకు పల్లకి సేవ నిర్వహించారు.