AP: ఏప్రిల్ 2న గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ పోలవరం ప్రాజెక్ట్ను సందర్శించనున్నారు. పర్యటనలో భాగంగా ప్రాజెక్ట్ పురోగతి పనులపై అధికారులను ఆరా తీయనున్నారు. కాగా పోలవరం ప్రాజెక్ట్ కీలక నిర్మాణాలు పూర్తవుతున్న నేపథ్యంలో ఒకసారి సందర్శించాలని, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ను సీఎం చంద్రబాబు కోరిన సంగతి తెలిసిందే.