AP: కృష్ణా జిల్లా చల్లపల్లి పోలీస్ స్టేషన్లో భారీ పేలుడు సంభవించింది. స్టేషన్లో నిల్వ ఉంచిన టపాసులు బయటకు తీస్తుండగా పేలుడు జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాద ఘటనలో ఎస్సై సహా మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. పేలుడు ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.