కడప నగర పాలక సంస్థ మలేరియా సెక్షన్ కార్మికుడు రామాంజనేయులు అప్పుల బాధ, వేధింపులు తాళలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో ఆయన మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. విషయం తెలుసుకున్న సీఐటీయూ నేతలు, అధికారులు రిమ్స్‌లో బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. వారికి అందాల్సిన మట్టి ఖర్చులు, ఇతర ప్రయోజనాలను వెంటనే మంజూరు చేస్తామన్నారు.