TG: ఏపీ ప్రభుత్వం యథేచ్ఛగా నీళ్లు తరలించుకుపోతుంటే.. టీజీ సర్కారు చోద్యం చూస్తుందని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఆరోపించారు. రెండేళ్లలో ఎన్నడూ లేని విధంగా నీళ్లు తీసుకెళ్తోందని, ఏప్రిల్ మొదటి వారంలో నీళ్లు ఇవ్వకపోతే పంటలన్నీ ఎండిపోతాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎత్తిపోతల పథకం రూ.1,200 కోట్లతో పూర్తయ్యేదని, 10% పనులు పూర్తి చేస్తే 12.5 లక్షల ఎకరాలకు నీళ్లు వచ్చేవని అన్నారు.