MLG: పల్లెలే దేశానికి పట్టుకొమ్మలు అని పంచాయతీరాజ్ శాఖ డైరెక్టర్ భగవాన్ రెడ్డి అన్నారు. వెంకటాపూర్ మండలంలోని కేశవాపూర్ గ్రామంలో నూతన సిసి రోడ్ల నిర్మాణ పనులను స్థానిక సర్పంచ్ భద్రయ్య, నేతలతో కలిసి భగవాన్ రెడ్డి ప్రారంభించారు. గ్రామాల సమగ్ర అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని, ప్రజా ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలవాలన్నారు.