MHBD: జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి ఇవాళ ఆందోళన చేపట్టారు. గత రెండేళ్లుగా తమ పెన్షన్ బకాయిలు రూ. 20,500 చెల్లించకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. వృథా ఖర్చులు తగ్గించి, తాము కష్టపడి దాచుకున్న డబ్బులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.