AP: రాష్ట్ర విభజన, వైసీపీ దివాలా పాలన అనంతరం ఇప్పుడిప్పుడే పరిస్థితి మెరుగవుతోందని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ‘రాష్ట్ర విభజన కంటే గత వైసీపీ పాలనతోనే ఎక్కువ నష్టం జరిగింది. అమరావతిని శాశ్వత రాజధానిగా నిర్మిస్తున్నాం. 2027 నాటికి పోలవరాన్ని పూర్తి చేసేలా పనులు చేస్తున్నాం. సంపద సృష్టిస్తూ.. ప్రజలకు సంపద పంచేలా చంద్రబాబు పాలన సాగుతోంది’ అని వివరించారు.