NGKL: బల్మూరు మండలం మైలారం గ్రామంలో ఉపాధి హామీ పథకంలో చేపడుతున్న ప్లాంటేషన్ పనులను టెక్నికల్ అసిస్టెంట్ (TA) మునీశ్వరి శనివారం పరిశీలించారు. రోడ్డుకు ఇరువైపులా నాటిన మొక్కల రక్షణ కోసం ఏర్పాటు చేస్తున్న కంచె పనులను ఆమె పర్యవేక్షించారు. ప్రతి మొక్క చుట్టూ మీటర్ పొడవు, వెడల్పుతో కంచె నిర్మించాలని, మొక్కల సంరక్షణలో జాగ్రత్తలు వహించాలని కూలీలకు అవగాహన కల్పించారు.