NLR: రాపూరు మండలం పెంచలకోన శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానంలో పవిత్రోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. మంగళవారం ఉదయం 8.00 గంటలకు విశేష పూజలు, అగ్నిరాధన ఉ.10.00 గంటలకు స్నపన త్రిమంజనం, సా.5.00 గంటలకు విశేష పూజలు, వేద పండితులు మంగళ వాయిద్యాల నడుమ ఘనంగా నిర్వహించారు. భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు.