SKLM: పాతపట్నం బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గ సభ్యులను పాతపట్నం ఎమ్మెల్యే గోవిందరావు తన కార్యాలయంలో మంగళవారం అభినందించారు. పాతపట్నం కోర్టుకు, బార్ అసోసియేషన్‌కి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు. మెలి యాపుట్టి మండలాన్ని పాతపట్నం కోర్టులో విలీనమయ్యే విధంగా చర్యలు చేపడతానని హామీ ఇచ్చారు.