PLD: మాచర్ల (మం) విజయపురి సౌత్ నుంచి ప్రముఖ పర్యాటక కేంద్రం నాగార్జున కొండకు బోటుపై మంగళవారం కలెక్టర్ కృత్తికా శుక్ల పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మ్యూజియంలో చారిత్రక బౌద్ధ శిల్పాలను పరిశీలించారు. బోటుపై ప్రయాణించే క్రమంలో నిర్వాహకులు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పుకొచ్చారు.