HNK: కౌకొండ ZPHS పాఠశాలలో ఉపాధ్యాయురాలు మనోరమ ఉద్యోగ విరమణ సన్మాన సభను ఘనంగా నిర్వహించారు. సన్మాన సభకు ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి హాజరయ్యారు. ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. విద్యార్థులను ప్రయోజకులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర మరువలేనిదని, ఉపాధ్యాయులు నవ సమాజ నిర్మాతలు అని అన్నారు. కార్యక్రమంలో పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.