AP: మంత్రి గొట్టిపాటి రవికుమార్ APCPDCL, నెడ్‌క్యాప్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పీఎం సూర్యఘర్ పథకం కింద SC, STలకు ఉచితంగా సౌర విద్యుత్ అందించాలని ఆదేశించారు. మంజూరైన 6 లక్షల కనెక్షన్లను త్వరగా పూర్తి చేయాలని, ప్రతి నియోజకవర్గంలో ఒక మోడల్ సోలార్ విలేజ్ ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు.