PDPL: ధర్మారం మండలంలో నిన్న అర్ధరాత్రి వీచిన గాలులకు మామిడి తోటలలోని కాయలు నేలరాలాయి. బొట్ల వనపర్తి గ్రామానికి చెందిన పెంటయ్య తన మూడు ఎకరాల తోటలోని మామిడికాయలు గాలుల బీభత్సానికి రాలిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం అకాల వర్షం, గాలులకు నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని కోరుతున్నారు.