సిరిసిల్ల నూతన మున్సిపల్ కౌన్సిల్ ప్రజలకు ఉత్తమ సేవలు అందించాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆకాంక్షించారు. సిరిసిల్ల మున్సిపల్ బడ్జెట్ సమావేశాన్ని మున్సిపల్ కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లో మంగళవారం నిర్వహించగా, కలెక్టర్ గరిమ అగ్రవాల్ హాజరై మాట్లాడారు. అందరి సహకారంతో ఇటీవల ఎన్నికలు విజయవంతంగా పూర్తి చేశామని, నూతన సభ్యులందరికీ అభినందనలు తెలియజేశారు.