MNCL: లక్షెట్టిపేట మున్సిపాలిటీలో కో ఆప్షన్ సభ్యుల పదవుల కోసం నోటిఫికేషన్ విడుదల చేశామని మున్సిపల్ ఛైర్మన్ దొంత అంజలి నరసయ్య, కమిషనర్ విజయ్ కుమార్ తెలిపారు. మంగళవారం వారు మాట్లాడుతూ.. మున్సిపాలిటీలో కో ఆప్షన్ సభ్యుల ఎంపిక కోసం నోటిఫికేషన్ విడుదలైందన్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు 7వ తేదీ వరకు కో ఆప్షన్ సభ్యుల పదవి కోసం దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు.