W.G: ఏప్రిల్ 7 నుంచి 16 తేదీ వరకు పెనుగొండ మండల వ్యాప్తంగా నిషేధిత భూముల జాబితాపై గ్రామసభలు నిర్వహించనున్నట్లు తహసీల్దార్ జి. అనిత కుమారి తెలిపారు. 7న ఇలపర్రు, నడిపూడి, 8 న చిన్నమల్లం, వెంకట రామపురం, 9న మునమర్రు, దేవ, 10న తామరాడ, కొటాలపర్రు, 13 ములపర్రు, రామన్నపాలెం 15న వడలి, సిద్ధాంతం, 16న చెరుకువాడ, పెనుగొండ గ్రామాల్లో సభలు నిర్వహించనున్నట్లు తెలిపారు.