PDPL: మంథని మండలం కన్నాల గ్రామంలో మహిళ అక్షరాస్యత కార్యక్రమం ULLASలో భాగంగా ZPHS స్కూల్ కన్నాల గ్రామంలో మహిళలకు పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ గుడిసె గట్టయ్య యాదవ్ మాట్లాడుతూ.. మహిళ గ్రూపు సభ్యులు అందరూ చదువుకొని సంతకం వచ్చే విధంగా నేర్చుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్ భాగ్యలక్ష్మి, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.