రణ్బీర్ కపూర్, సాయి పల్లవి సీతారాములుగా నితేష్ తివారీ దర్శకత్వంలో రాబోతున్న మూవీ ‘రామాయణ’. ఏప్రిల్ 2న ఈ మూవీ గ్లింప్స్ విడుదల కానున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ గ్లింప్స్ సెన్సార్ పనులు పూర్తయినట్లు తెలుస్తోంది. దీనికి సెన్సార్ బోర్డు ‘U’ సర్టిఫికెట్ జారీ చేసిందట. ఇక ఈ గ్లింప్స్ 2:38 నిమిషాల నిడివితో రాబోతున్నట్లు టాక్.